సిద్ధాంతం... గిద్ధాంతం నాన్సెన్స్...

మహాకవి శ్రీశ్రీ "మహా ప్రస్థానం"లో 'ఔను నీవన్నది నిజం నిజం' అనే మాట ఒకటి ఉన్నది. మన ఎర్ర సోదరులు అనగా కమ్యూనిస్టులు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. క్రిందపడినా మేమే గెలిచామంటారు. మట్టి కరిచినా, మీసానికి మన్ను అంటుకున్నా విజయం మాదేనని మేకపోతే గాంభీర్యానికి పోతూంటారు. గత కొన్ని దశాబ్దాలుగా అన్ని రంగాలలో, అన్ని దేశాలలో వైఫల్యాలను మూట కట్టుకున్నా కూడా, కమ్యూనిస్టుల సైద్ధాంతిక నిబద్ధతే చాలా ఘనం అంటారు. ఐతే ! ఈ మధ్యకాలంలో భ్రమలు తొలగిపోతున్నాయి. సిద్ధాంతపరమైన ఓటమిని బహిరంగంగా ఒప్పుకోలేక అలాగని దిగమ్రింగలేక సతమతమౌతున్నారు మన కమ్యూనిస్టు సోదరులు.  
మార్క్సిస్టు వీరాభిమానులైన ఇద్దరు కార్యకర్తల సంభాషణ పైకి పొక్కింది. వాళ్లలో ఒకాయన "కరప్షన్ ను మనం అంగీకరించినంత ఎవ్వరూ చేయరన్నా". రెండో ఆయన అంటాడు 'ఔను, ఎవడు ఎంతయినా తిననీ, ఎంతైనా దోచుకోనీ. మనకు మాత్రం మెంబర్లు కావాలి, ఓట్లు రావాలి. సిద్ధాంతం... గిద్ధాంతం నాన్సెన్స్'.  
ఇదండీ! నేటి కమ్యూనిస్టుల పరిస్థితి. కొన్నాళ్లకు కమ్మీలు కూడా కళ్లు తెరచి హిందుత్వ వాదాన్నీ, సిద్ధాంతాన్నీ ఒప్పుకొంటూ "ఔను నీవన్నది నిజం... నిజం..." అని అన్నా మనం ఆశ్చర్యపడనక్కరలేదు.
- ధర్మపాలుడు