న్యాయవ్యవస్థలో మౌలిక మార్పు అత్యవసరం

ప్రముఖుల మాట


అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య పెరిగిపోవడం కంటే కలవరపరిచే విషయం మన న్యాయవ్యవస్థలో మరొకటి ఏముంది? దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనే 56,893 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టులు, క్రిందిస్థాయి కోర్టులలో మొత్తం అపరిష్కృత కేసుల సంఖ్య కోట్లలో ఉంటుందనడంలో సందేహం లేదు. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారానికి మూడు ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేస్తామని సీజేఐ లోధా చెప్పారు. ఈ చక్కని మాటలను సత్వరమే చేతల్లోకి మారుస్తారా మిలార్డ్? 

మన న్యాయవ్యవస్థలో మౌలిక మార్పులు చోటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అత్యున్నత స్థాయి న్యాయమూర్తుల స్థిర నాయకత్వంలో మాత్రమే అటువంటి మార్పులు సాధ్యమవుతాయి. 

- ఇందర్ మల్హోత్రా, ప్రముఖ జర్నలిస్టు