ఏడేళ్ళ వయసులోనే ధర్మప్రవచనాలు

 
బీహారు రాష్ట్రానికి చెందిన ధర్మపురాశ్రమంలో శివానంద తివారి అనే ఏడు సంవత్సరాల బాలుడు భగవద్గీత, పురాణాలను క్షుణ్ణంగా చదువుకున్నాడు. స్థానికంగా ఉన్న దేవాలయాలలో ప్రవచనాలు చెప్పేవాడు. కేవలం ఏడు సంవత్సరాల వయసు ఉన్న ఈ పిల్లవాడు చెప్పే విషయాలు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. పాట్నాలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శివానంద తెలివితేటలు గమనించి ఆంగ్లవిద్య చదువుకోమని సలహా ఇచ్చాడు. 
 
ఇప్పుడు 14 సంవత్సరాల వయస్సులో ఉన్న శివానంద తివారి IIT ప్రవేశ పరీక్ష వ్రాసి 2587వ ర్యాంకు సాధించాడు. తనకు భౌతికశాస్త్రంలో (Physics) పరిశోధనలు చేయాలని ఉన్నదని పిల్లవాడు చెబుతున్నాడు. 
 
IIT ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణుడైన వారిలో అతిపిన్న వయసు (14 సంవత్సరాలు) పిల్లవాడు ఇతడేనని, ఇది ఒక జాతీయ రికార్డు అని IIT వర్గాలు పేర్కొన్నాయి.
 
- ధర్మపాలుడు