పాకిస్తాన్ లో మన పూర్వ దేశాధ్యక్షుని ఇల్లు ధ్వంసం

జాకిర్ హుస్సేన్
 
భారతదేశ పూర్వ రాష్ట్రపతి స్వర్గీయ శ్రీ జాకిర్ హుస్సేన్ జన్మించిన ఆయన సొంతింటిని పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో నేలమట్టం చేసారు.  వ్యాపార సముదాయం కట్టబోతున్నారు. ఈ ఇల్లు 500 గజాల స్థలంలో ఉంది. ఈ ఇంటిని ఓ స్మారకంగా చేయమని ఎవరూ అడగలేదట. దానితో రహస్యంగా దాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పాక్షికంగా కూలగొట్టింది. స్థానికులు వ్యతిరేకించడంతో ప్రస్తుతానికి ఆపారు. జాకీర్ హుసేన్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. ఇప్పడు సొంత ఇంటిని కూడా కోల్పోబోతున్నారు. ప్రస్తుత కేంద్ర విదేశాంగమంత్రి ఆయన మనుమడు. కాని వారెపుడూ స్మారకం గురించి ప్రయత్నించలేదు.

- హనుమత్ ప్రసాద్