బలమైన శత్రువు


'ఊళ్లో పెళ్లికి కుక్కల సందడి' అని ఒక సామెత ఉంది. పాకిస్తాన్లో ఎన్నికలైతే మన వారికి సంతోషం. నవాజ్ షరీఫ్ పాకిసా్తన్ ప్రధాని అయితే మనకు సంబరం. నవాజ్ షరీఫ్ ప్రధాని కాబట్టి పాక్ తో మనకు స్నేహ సంబంధాలు మెరుగవుతాయని మన్మోహన్ సింగ్ గారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇది ఇలా ఉండగా మిత్రుడు అని అనుకుంటున్న షరీఫ్ రాబోయే సంవత్సరానికి గాను పాకిస్తాన్ రక్షణ వ్యయం 15శాతం పెంచాడు. అనగా పాకిస్తాన్ అక్షరాల ఆరు లక్షల ఇరువది వేల కోట్ల రూపాయలు సైన్యం మీద ఖర్చు పెట్టబోతున్నది. పాకిస్తాన్ భాషలో 'రక్షణ" అంటే భారత్ తో యుద్ధం చేయడమే.
- ధర్మపాలుడు