తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి

గృహ వైద్యము - 10 


తెల్ల వెంట్రుకలు : 
  • ఆశ్వీయుజ మాసమునందు ప్రతినిత్యము 1 నుండి 2 గ్రాముల కరక్కాయ పొడిని తేనె అనుపానముగా దినమునకు రెండుమారులు సేవించుచున్నచో తెల్లవెంట్రుకలు నల్లబడును.
  • ఊడుగ పువ్వులు, గుంటగలగర ఆకు, కలువ దుంపలు సమాన భాగమలుగా తీసుకొని మెత్తగా నూరి రెట్టింపు నువ్వుల నూనె కలిపి తైలపక్వముగా కాచి వడకట్టుకొని ఆ తైలమును వంటికి మరియు శిరస్సుకు మర్దన చేసుకొనుచున్న ఎడల తెల్లవెంట్రుకలు నల్లబడును.
  • కామంచి గింజలు, నల్లనువ్వుల సమభాగములుగా తీసుకొని గానుగలో వేసి తైలము తీయవలెను. ఆ నూనెను తలకు రాసుకొనుచున్న ఎడల తెల్లవెంట్రుకలు నశించుటయే గాక అన్ని రకములైన తలనొప్పులు కూడా తగ్గిపోవును.

ఊడుగ కాలు

 

తుమ్ముల రోగము :
  • నాలుగు చుక్కల నువ్వుల నూనె చెవిలో వేసి దూది పెట్టి వేడినీళ్లతో తలస్నానము చేయుచుండిన ఎడల అతిగావచ్చే తుమ్ముల రోగము తగ్గిపోవును.
  • గులాబీ పూవులు వేసి కాచి వడగట్టిన నువ్వుల నూనె 2  నుండి 3 చుక్కలు ముక్కులో వేయుచుండిన అతిగా తుమ్ములు వచ్చు వ్యాధి రెండు, మూడు రోజులలో తగ్గిపోవును.

తెల్ల కుసుమ (తెల్ల బట్ట) :

  • ఉసిరికాయ గింజలోని పప్పును 2 గ్రాములు మంచినీళ్లతో కల్కము వలె నూరి పటికబెల్లపు పొడిని అవసరమైనంత కలిపి ప్రతిరోజూ ఒకసారి చొప్పున నలభయి రోజులు సేవించినచో తెల్లబట్ట వ్యాధి హరించును.
  • ఉలవలతో కట్టు కాచుకొని ప్రతిరోజూ త్రాగవలయును.
  • దొండతీగ ఆకుల రసము రెండున్నర తులములు (30 మి.గ్రా.) జీలకర్ర చూర్ణము పావుతులము (3 గ్రా.) కలిపి పూటకొక్క మోతాదుగా రోజుకు రెండుపూటలా పుచ్చుకొనుచున్న ఎడల తెల్లబట్ట వ్యాధి హరించును.

- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..