తులసిలో ఔషధ గుణాలు

ప్రముఖుల మాట 
 
 
ఇప్పటి వరకూ తులసిపై జరిగిన అధ్యయనాలు, పరిశోధనలన్నింటినీ ఒక్కసారి చూస్తే దానిలో మనకు మేలు చేసే రసాయనాలు ఎన్నో ఉన్నాయని స్పష్టమౌతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. హానికారక విశృంఖల కణాలను ఇవి అడ్డుకుంటుంటాయి. అలాగే తులసికి వైరస్ వ్యాధులను నిరోధించే గుణం ఉంది. సూక్ష్మక్రిముల కారణంగా తలెత్తే వ్యాధులను అడ్డుకునే స్వభావమూ ఉంది. కాబట్టి తులసిని మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల కచ్చితంగా మేలే జరుగుతుంది. ఆహారంలో కాకపోతే రోజూ కొన్ని ఆకులు తిన్నా మేలే.
 
- డా.చంద్రకాంత్ ఈమని
(అమెరికాలోని వెస్ట్రన్ కెంటకీ యూనివర్శిటీ పరిశోధకులు. 
తులసిలో క్యాన్సర్ ను నిరోధించే గుణాలపై పరిశోధనలు చేస్తున్నారు.)
 
- ఈనాడు సౌజన్యంతో...