ప్రముఖుల మాట

 
ప్రలోభాల వల్ల అన్య మతాలలోకి మారుతున్నఅవివేకులను ఇక్కడ చూస్తున్నాము. ఎవరూ ప్రలోభ పరచకుండానే, ప్రచారం చేయకుండానే తమంత తాము భారతీయ హైందవ సనాతన సంస్కృతిని అధ్యయనం చేసి ఈ సంస్కృతిలోకి పరివర్తన చెందుతున్న విదేశీ మేధావులను పాశ్చాత్య దేశాలలో చూస్తున్నాము.
 
- సామవేదం షణ్ముఖశర్మ

గడచిన 18,000 సంవత్సరాలలో భూగోళం అసంఖ్యాకమైన వాతావరణ వైరుధ్యాలను ఎదుర్కొన్నది. వాతావరణ వైరుధ్యాలను ఎదుర్కొన్నది. విభిన్నరీతులైన వాతావరణ పరిస్థితులు ఎన్నోవచ్చాయి, పోయాయి. మొన్న మనం హిమాలయాలలో చూసినది మహా భయంకర పరిస్థితి. అయినా కేదారనాథ్్ ఆలయం మాత్రం కాలం విసిరిన అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని స్థిరంగా నిలిచింది. 
 
- రవీందర్ కుమార్ చౌజర్, పాత్రికేయుడు.