నేటి లోకానికి టివిలే గురువులు !


లోకహితం మాసపత్రిక నిజంగా లోకమునకు ఎనలేని హితమును కూర్చుచున్నది. ఈ రోజులలో టివిలే లోకానికి గురువులు. నోటిలో చిగుర్లు ఎందుకు, అవి ఎట్లా తోమాలనేది టివిలు చెబితేనే తెలుసుకొనే స్థితిలో ఉన్నది నేటి లోకం. 

జిహాద్ అంటే ఇంద్రియ నిగ్రహం అని అర్థం. ఇస్లాం అంటే మోక్షం అని బేగం హజరత్ రుయాల్ అరబిక్ నిఘంటువు చూపి నిరూపించింది. కాని వాస్తవం వేరు. 

అట్లే భగవంతుని కుమారుడగు ఏసు పాపులను రక్షించునని మైకులు పెట్టి కావాలని చెవులు బద్దలు కొట్టడం తగదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును లోకహితంలో ప్రచురించటం ఎంతో హర్షణీయం. మేల్కొలుపు. 

ఒకరికి, ఒక వర్గమునకు అన్యాయం జరిగిదని ఆక్రోశిస్తూ తన పొట్ట పోసుకొనే సెతల్వాడ్ వంటి మగువలను, వారు చేసే ప్రచ్ఛన్న కార్యకలాపాలను బయటపెట్టిన వార్త లోకహితం ఆగష్టు 2013 సంచికలో ప్రచురించటం ఎంతో, ఎందరికో కనువిప్పు. 

- నారుమంచి లక్ష్మీనరసింహమూర్తి
నల్లకుంట, హైదరాబాద్.