పాకిస్తాన్ విజయాన్ని పండుగ చేసుకొన్నారు

 
ఈ సంఘటన మార్చి నెలలో జరిగింది. మీరట్ లోని వివేకానంద సుభారతి విశ్వవిద్యాలయం 67 మంది విద్యార్థుల్ని బహిష్కరించింది. కారణం వారు, పాకిస్తాన్ ఇండియాతో ఆడిన క్రికెట్ మ్యాచ్ లో పాక్ విజయాన్ని పండుగగా జరుపుకోవడమే.  
 
ఈ విద్యార్థులు కాశ్మీర్ కు చెందినవారు. మదన్ లాల్ ఢింగ్రా వసతి గృహంలో నివాసం ఉంటున్నారు. ఓ క్రికెట్ మ్యాచ్ ను టి.వి.లో చూస్తున్నారు. ఇండియా ఓడిపోతుండటం చూసి 'పాకిస్తాన్ జిందాబాద్' అనే నినాదాలిస్తూ పాకిస్తాన్ విజయాన్ని సంబరం చేసుకోవడం కొందరు స్థానిక విద్యార్థులు వ్యతిరేకించారు. విచారణ తరువాత వారు తప్పు చేసినట్లు రుజువైంది. వారిని ఉప కులపతి ఇంటికి పంపించారు. వారిపై హింస, విశృంఖలత్వం వంటి విషయాలపై కేసులు నమోదయ్యాయి.  
 
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ యుపి ముఖ్యమంత్రిని ఈ విషయంలో చూసీ చూడనట్లు పొమ్మని, విద్యార్థుల చదువు కొనసాగేలా చూడమని కోరారు.  
 
దీని గురించి హురియత్ కాన్ఫరెన్స్  శ్రీనగర్ లో భారత వ్యతిరేక ప్రదర్శన జరిపింది. ప్రదర్శనలో నాయకులు మాట్లాడుతూ 'పాకిస్తాన్ జిందాబాద్ అనడం నేరం కాదని, జమ్మూకాశ్మీర్ ప్రజలు భారత్ లో ఎక్కడా సురక్షితంగా లేరని, కాశ్మీర్ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పాకిస్తాన్ కు వెళ్లాలని సూచించారు. దురదృష్టవశాత్తూ హమార్ సమాజ్, సహిఫట్, ఇంక్విలాబ్ వంటి కాశ్మీరీ పత్రికలేవీ ఈ సంఘటనలను ఖండించలేదు. 
 
- హనుమత్ ప్రసాద్