కోకిల కంఠం కావాలా?

గొంతు బొంగురు, గొంతు నొప్పి తగ్గటానికి  (కోకిల కంఠం) 

కోకిల

  • ఒకటి నుండి రెండు టీ చెంచాల (5 నుండి 10 మి.లీ.) మంచి తేనెను గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని రోజుకు మూడు నుంచి నాలుగు మారులు త్రాగుచుండిన గొంతు బొంగురు పోవుట, నొప్పి, గొంతు పూత మరియు మంట హరించిపోవును.
  • చలువు మిరియాలు నోట్లో వేసుకొని నములుచూ ఆ రసమును మింగుచుండిన బొంగురు గొంతు వ్యాధి హరించును. 

మిరియాలు

  • వావిలి చెట్టు వేరు చూర్ణము ఒక గ్రాము మాత్ర, నువ్వుల నూనెలో కలిపి ప్రతిదినము సేవించుచున్న ఎడల స్వరము బొంగురు నశించుటయే గాక కోకిల వంటి కంఠధ్వని కలుగును.
  • కాల్చిన లవంగములను బుగ్గన పెట్టుకొని రసము మింగుచుండిన గొంతు బొంగురు తగ్గిపోవును.
  • తమలపాకు తీగ వేరును బుగ్గన పెట్టుకొని రసము మింగుచుండవలెను.

చిగుళ్ల వాపు, నొప్పి తగ్గటానికి 

అందమైన చిగుళ్లు

  • జామచెట్టు ఆకులను రెండు రెట్ల నీళ్లలో మరిగించి వడపోసి ఆ కషాయముతో పుక్కిలించిన చిగుళ్లవాపు, నొప్పి హరించును. అవసరమును బట్టి రోజుకు రెండు నుండి మూడుసార్లు పుక్కిలించవలెను.
  • నల్ల తుమ్మచెట్టు పట్టతో కషాయము కాచి దానిలో కొద్దిగా పటిక కలిపి పుక్కిలించిన దంతముల నొప్పి, చిగుళ్లవాపు, నొప్పి, చీము కారుట హరించును.
  • నేరేడు ఆకుల రసమును పుక్కిలించుటకు వాడిన, ఉబ్బి మెత్తబడిన చిగుళ్లు గట్టిపడి నొప్పి హరించును.
  • మామిడి ఆకుల కషాయముతో పుక్కిలించిన దంతరోగములు, చిగుళ్ల వాపు, నొప్పులు, నోటిపూత నెమ్మదించును.

- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..