మైనారిటీలను ఇంకా మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్


మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మైనారిటీల ఓట్లు కొల్లగొట్టేందుకు తాయిలాలను సమకూర్చుకొంటున్నది. అవే మైనారిటీలకు రిజర్వేషన్లు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం అనేకసార్లు స్పష్టం చేసినప్పటికి మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహమ్మదీయులకు 5% రిజర్వేషన్లను అమలు పరుస్తామనే హామీనిస్తున్నది. దీనితో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించిపోతాయి. ఇదికూడా రాజ్యాంగ విరుద్ధమే. ఇవన్నీ తెలిసికూడా కాంగ్రెస్ మళ్ళీ పాతపాటే పాడుతూ మైనారిటీలను మోసం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికైనా భారతదేశ మైనారిటీలు కాంగ్రెస్ కుటిలబుద్ధిని గ్రహించి నిజమైన అభివృద్ధికి ఓటు వేస్తారని ఆశిద్దాం. 
- పతికి