ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణుడి ఆలయం

 
అధర్మ వినాశకుడు, ధర్మరక్షకుడు అయిన మన శ్రీకృష్ణునికి ప్రపంచంలోనే అతి ఎత్తైన, పెద్దదయిన దేవాలయం మనదేశంలో మధుర వద్ద బృందావనంలో రూపుదిద్దుకుంటున్నది. కోల్ కతాకు చెందిన ఇన్ ఫినిట్ గ్రూపు అధిపతి రవీంద్ర భూమారియా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. బెంగళూరులోని ఇస్కాన్ వారు కూడా ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకుంటున్నారు. 
 
70 ఎకరాల స్థలంలో 210 మీటర్ల ఎత్తు ఉండే ఈ శ్రీకృష్ణాలయంలో భాగంగా ఒక గ్రంథాలయం, పరిశోధనాలయం, కృష్ణలీలా ఉద్యానవనం, నివాస స్థలం, సకల సౌకర్యాలతో కూడిన విల్లాలు, 11 అపార్ట్ మెంట్లు ఉంటాయి. 
 
బాలకృష్ణుడు తన లీలలను ప్రదర్శించిన 12 వనాలతో కూడిన వ్రజస్థానంలో ఈ ఆలయ నిర్మాణం శ్రీకృష్ణాష్టమి అనగా 30 జూలై 2014 నాడు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత మధురకు వచ్చే భక్తులంతా బృందావనానికి కూడా వచ్చి వెళతారని రవీంద్ర భూమారియా చెపుతున్నారు.

- ధర్మపాలుడు