చెవిలో నొప్పి, చెముడు

గృహ వైద్యము - 8


చెవిలో చీము :
  • మల్లె ఆకుల నుండి రసము తీసి వడపోసి దానిలో నాలుగవ వంతు తేనె కలిపి 2 నుండి 4 చుక్కలను రోజుకు రెండు పూటలా చెవిలో వేయుచుండిన చెవిలో కారే చీము క్రమముగా తగ్గిపోవును.  
 
చెవిలో నొప్పి, చెముడు : 
  • నీరుల్లిపాయల రసమును కొద్దిగా వేడిచేసి (గోరు వెచ్చగా) 4 నుండి 6 చుక్కలు చెవిలో వేసిన చెవినొప్పి, చెముడు, చెవిలో హోరు తగ్గిపోవును.  
  • చేదు పుచ్చ వేరు రసము నాలుగు చుక్కలు చెవిలో వేసిన చెముడు తగ్గిపోవును.

జిగట విరేచనాలు : 
  • మామిడి జీడి చూర్ణము అరతులము (6 గ్రాములు) మజ్జిగలో కలిపి త్రాగుచున్న ఎడల కఠినములైన జిగట విరేచనాలు తగ్గిపోవును. 
  • మర్రి ఊడలను ముద్దగా నూరి అరతులం (6 గ్రాములు) ముద్దను మజ్జిగలో కలిపి త్రాగిన ఎడల నీళ్ల విరేచనాలు, జిగట విరేచనాలు మరియు రక్త విరేచనాలు మూడు రోజులలో తగ్గిపోవును. 
  • గ్లాసు వేడి నీళ్లలో ఆవు నెయ్యి ఒకటి లేక రెండు టీ చెంచాలు కలిపి త్రాగుచున్న ఎడల రక్త విరేచనాలు, బంక విరేచనాలు తగ్గిపోవును.

టాన్సిల్స్ వాపు : 
  • మామిడాకులను దంచి రసము తీసి ఆ రసమును దూదితో తీసుకొని వాచిన టాన్సిల్స్ పై లేపనం చేయవలెను. 
  • లేదా నీరుల్లిపాయల రసమును పై విధంగా లేపనం చేసినచో టాన్సిల్స్ పై వాపు క్రమముగా తగ్గిపోవును. 
 
- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..