మలబద్ధమును వదిలించండి

మలబద్ధమును వదిలించండి 
 
ఎండిన ఖర్జూర పండ్లు
 
  • ఎండిన ఖర్జూర పండ్లు రెండు నుంచి మూడు చొప్పున ప్రతిరోజు ఉదయం పూట తినాలి. ఇట్లు నెలరోజులపాటు చేసినచో మలబద్ధము మనలను వదిలిపోవును. 
  • 3 తులాల బియ్యము (40 గ్రాములు), 3 తులాల పటిక బెల్లము (40 గ్రాములు), ఎండు గులాబీ పూలు, 3 తులాలు మరియు అర్థ శేరు పాలు, వీటన్నింటిని కలిపి పాయసముగా వండి దానిలో 3 తులముల నేయిని కలపవలెను. ఈ మిశ్రమాన్ని తినవలెను. పిదప ఎన్నిమార్లు చల్లటి నీళ్ళు త్రాగిన అన్నిమార్లు కష్టము లేకుండా విరేచనము అగును. మరియు ఒకసారి వేడినీళ్ళు త్రాగినచో విరేచనము అవుట ఆగిపోవును. ఈ విధంగా రెండు నెలలకొకసారి చేసుకొనిన ఏ విధమైన రోగములు లేకుండా ఉండును. 
  • ఒక గ్లాసు బార్లీ గంజిలో ఒకటి లేక రెండు టీ చెంచాల తేనె కలుపుకొని ప్రతినిత్యమూ త్రాగుచున్న సుఖముగా మలవిసర్జన జరుగును. 
  • ప్రతినిత్యమూ ప్రాత:కాలమున పండిన బొప్పాయి పండ్లను తినుచుండవలెను. దీనివలన మలబద్ధము హరించును. 
  • పొట్టు తీయని గోధుమలను పిండిగా చేసుకొని రొట్టెలు చేసుకొని తినుచుండిన స్వాభావికముగా మలబద్ధము హరించును. ఈ పద్ధతి ఔషధముల కన్నా ఎక్కువ లాభకరము. వాము, బిడాలవణము రెండును సమభాగములుగా కలిపి చూర్ణము చేయాలి. ఆ చూర్ణమును పావుతులము తీసుకొని పావుశేరు మజ్జిగలో కలుపుకొని ప్రతినిత్యమూ త్రాగుచున్న ఎడల మలబద్ధము హరించిపోవును.

మలేరియా జ్వరము తగ్గుటకు  
  • కానుగ గింజల పప్పు ఒకవంతు, పావువంతు మిరియాలు కలిపి చూర్ణము చేసి చలిజ్వరము వచ్చుటకు ఒక గంట ముందుగా ఆరు గురిగింజల ఎత్తు (750 మి.గ్రా.) చూర్ణము మంచినీటితో ఇవ్వవలెను. ఇట్లు రెండు నుంచి మూడురోజులు ఇచ్చిన మలేరియా జ్వరము తగ్గిపోవును.
- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..