చరిత్ర అధ్యయనానికి క్రొత్త ఊపిరి

ప్రొ. యల్లాప్రగడ సుదర్శనరావు
 
2014వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల తరువాత భారతదేశానికి మంచికాలం వచ్చింది. మన చరిత్రను సరిగా పరిశోధించి అధ్యయనం చేయడానికి స్థాపించబడిన సంస్థ భారతీయ చరిత్ర పరిశోధనా సంస్థ (ICHR). ఆ సంస్థకు మన తెలంగాణ రాష్ట్రం పాలమూరుకు చెందిన శ్రీ యల్లాప్రగడ సుదర్శనరావును మోది ప్రభుత్వం అధ్యక్షునిగా నియమించింది. సుదర్శనరావు చరిత్ర పరిశోధనలో నిష్ణాతుడు. 'రామాయణ, మహాభారతాలు కల్పితాలు కావు', '3 వేల సంవత్సరాలకు పూర్వం మన దేశంలో అంటరానితనం లేనే లేదు' అని చెప్పిన సుదర్శనరావు చరిత్రలో సత్యశోధన చేయాలి, నిజమైన మన ఘన చరిత్రను వెలికి తీయాలి. ఆ కృషిలో నిమగ్నమైన మన సుదర్శనరావుగారి కృషి ఫలించాలని అందరూ కోరుకుంటున్నారు.
 
- ధర్మపాలుడు