ఏరిన ముత్యాలు - పద్యాలు

సుమతీ శతకము
మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభటకోట ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ !


భావం : ఓ సుబుద్ధీ! ఈ భూమి లోపల మాటకు సత్యము, కోటకు సుశిక్షితులైన భటుల బృందము, స్త్రీకి శీలము, పత్రముకు చేవ్రాలు (సంతకము) ప్రాణము వంటివి.