సనాతన ధర్మ పరిరక్షణ అందరి కర్తవ్యం

వేల సంవత్సరాల నుండి వారసత్వంగా వస్తున్న సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైనది. ఈ ధర్మాన్ని రక్షించుకోవలసిన బాధ్యత పౌరులపై ఉంటుంది. ప్రతి పౌరుడు తన దేశ హితాన్ని గురించి ఆలోచించాలి. నేటి యుగంలో ప్రతి వ్యక్తి తన కుటుంబ పరిధిని దాటడం లేదు. అట్లే కాకుండా వ్యక్తి తన కుటుంబ పరిధి ఆలోచనలను దాటి విస్తరించాలి. స్వార్థ చింతనతో కాకుండా జాతీయ హితం కోసం ఆలోచించడం మంచిది. మనలోని త్యాగగుణం బాగా వికసించాలి. ప్రపంచంలో అంతటా దైవత్వం ఉన్నది. ఆ దైవత్వాన్ని గుర్తించిన వారు సుఖదు:ఖాల తారతమ్యం లేకుండా ఎంతో సంతృప్తిగా జీవించగలరు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలి. సనాతన ధర్మ పరిరక్షణ వల్ల ప్రపంచం యావత్తూ సుఖశాంతులతో ఉండగలుగుతుంది. 
- సద్గురు శివానందమూర్తి