శంకర పర్వతమా? సులేమాన్ పర్వతమా?


కాశ్మీర్ లో ఉన్న శంకరాచార్య పర్వతాన్ని సులేమాన్ పర్వతంగా అక్కడి పురాతత్వ శాఖ పేర్కొనటాన్ని అమెరికాలోని విశ్వహిందూపరిషత్ వారు అభ్యంతరం తెలిపారు. ఆ పర్వతం "ఆదిశంకర పర్వతం" అనేందుకు అనేక సాక్ష్యాలు, ప్రమాణాలు ఉన్నాయి. ఈ విషయం శంకర విజయం పుస్తకంలో స్పష్టంగా పేర్కొనబడింది. ఆదిశంకరాచార్యుల వారు దక్షిణ ఆసియాలో పర్యటించారు. వారికి కాశ్మీర్ తో విడదీయరాని సంబంధాలు ఉన్నాయి. అటువంటి చరిత్రను తప్పుదారి పట్టించే విధంగా కాశ్మీర్ పురాతత్వ విభాగం ప్రయత్నించటాన్ని విశ్వహిందూ పరిషత్ వారు ఖండిస్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి వివాదాలు లేవు. అక్కడ శంకరాచార్య మందిరం కూడా ఉన్నది. వీటన్నింటిని విస్మరించడం రాజకీయ కుట్రగా భావించవలసి వస్తుంది. ఈ విషయంపై ఒక వినతిపత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి అమెరికా విశ్వహిందూ పరిషత్ వారు పంపించారు.

- సమాచార భారతి