తలనొప్పికి మందు

గృహ వైద్యము - 9
 
 
తలనొప్పి : 
  • తినే ఉప్పు మరియు పటికబెల్లం సమానంగా కలిపి పొడిచేసి 1 నుండి  2 గ్రాముల వరకు రోజుకు రెండు పూటలా వేడినీళ్ల అనుపానముతో లోనికి సేవించిన తలనొప్పులు నిశ్చయముగా తగ్గిపోవును. ఈ విధముగా నలభై రోజులు చేయవలసి ఉండును.  
  • పుదీనా పూవు 10 గ్రాములు, ఓమ పువ్వు 10 గ్రాములు, కర్పూరము 20 గ్రాములు తీసికొని విడివిడిగా నూరి ఒక సీసాలో వేసి కలిపి ఎండలో ఉంచిన కరిగి ద్రవము అగును. అందులో 10 గ్రాముల సోపు గింజల నూనె కలుపవలెను. దీనిని కొద్దిగా నుదురుపై రుద్దుచుండిన పడిశము, తలనొప్పి తగ్గిపోవును.

తలలో పేలు :
  • పావు తులము (3 గ్రాములు) పటికను ఒక లీటరు నీళ్లలో కరిగించి ప్రతిరోజు తలకు రుద్దుకొనుచున్న ఎండల తలలో పేలు హరించును.
 
తామర : 
  • కొబ్బరిచిప్పలు కాల్చి దాని నుండి వచ్చిన చమురును తామరపై పూసిన సమూలముగా తామర నశించును. 
  • మోదుగ గింజల పొడిని నిమ్మపండ్ల రసములో కలిపి పూసిన తామర నశించును. 
  • నీరుడి విత్తుల నుండి తీసిన తైలములో సమభాగముగా మైనము లేక వ్యాజులైను కలిపి పైన లేపనముగా పూయుచుండిన తామర, దురదలు, చర్మముపై మచ్చలు నశించును. 
 
 - శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..