చెప్పేది శ్రీరంగనీతులు...

 
వినే వెఱ్లివాళ్లు ఉంటే, నీతులు ఎన్నయినా చెప్పవచ్చు. ప్రపంచానికి ఎల్లలు లేవనీ, దీనజనోద్ధరణ తమ ధ్యేయమని చెప్పుకునే మార్క్సిస్టు కమ్యూనిస్టులు ఆచరణలో బూర్జువాల లాగే ఉంటారని నిరూపించాడు ఒక కమ్మీయుడు. 
 
ఇందూరు జిల్లాని ఆనుకుని ఒక అటవీ ప్రాంతం ఉన్నది. అందులో నల్లవెల్లి గ్రామం (ధరాపల్లి మండలం) ఉన్నది. అక్కడ గంగయ్య, అరణ్య పాలకుడు (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు) గా పని చేస్తున్నాడు. గంగయ్య నీతికి ధైర్యానికి మారుపేరు. అయితే ఇదే అటవీ ప్రాంతంలో అక్రమంగా భూమిని ఆక్రమించి సాగుచేస్తున్న కామ్రేడ్ వడ్డె భాస్కరం అనే సిపిఐ(ఎం) నాయకుడికి, అతడు చేస్తున్న విద్రోహ చర్యలకు గంగయ్య అడ్డుగా ఉన్నాడు. 
 
ఇది సహించలేని కామ్రేడ్ భాస్కరం ఒక పథకం ప్రకారం గంగయ్యని 15 సెప్టెంబర్ 2013న దారుణంగా చంపించాడు. ఈ దొమ్మిలో ఏడు మంది అరణ్యసేవకులు (ఫారెస్ట్ గార్డ్స్) తీవ్రంగా క్షతగాత్రులయ్యారు. ఈ దొమ్మిని ప్రజల తిరుగుబాటుగా చిత్రీకరించడానికి ఎంతో ప్రయత్నం జరిగింది. కాని పోలీస్ ఎస్.పి.మోహనరావు, కలెక్టర్ ప్రద్యుమ్నుడు, విభాగ అటవీ అధికారి భీమనాయక్ ల చొరవతో వాస్తవం బయటకు వచ్చింది. కామ్రేడ్ గారు ఊచలు లెక్కబెడుతున్నారు.
 
- ధర్మపాలుడు