పిప్పి పన్నుకు మందు

గృహ వైద్యము - 14


పిప్పి పన్నుకు 
  •  ప్రత్తి గింజలను ఎండబెట్టి, కాల్చి మసి చేసి సీసాలో నిల్వ ఉంచుకొనవలెను. ఆ మసితో రోజూ పండ్లు శుభ్రపరచు కొనుచున్న ఎడల పండ్లలోని క్రిములు పడిపోవును.


  • ఉత్తరేణి ఆకుల రసము చెవిలో వేయుచున్న ఎడల పిప్పి పన్నులోని క్రిమి నశించి బాధ ఉపశమించును.

పులి త్రేనుపులు
  • వేయించిన గోధుమపిండి లేక వరి పేలాల పిండి, దానికి సమానంగా పటిక బెల్లము తీసుకొని, రెండూ కలిపి తినుచున్న ఎడల పులి త్రేనుపులు తగ్గిపోవును. 2 తులముల (24 గ్రాములు) మోతాదులో, దినమునకు 2 నుండి 3 సార్లు ఇట్లు తినవలెను.నిమ్మకాయ రసము 2 తులములు (25 మి.లీ.) సమభాగము తేనెతో కలుపుకొని దినమునకు రెండు మారులు త్రాగుచున్న ఎడల పులిత్రేనుపులు తగ్గిపోవును.
  • ఎండిన అరటి ఆకులను కాల్చి బూడిదగా చేసి  2 నుండి  4 గ్రాముల బూడిదను తేనెలో కలిపి దినమునకు 2 నుండి 3 మార్లు తీసుకొనవలెను.  
  • శొంఠి, మిరియాలు, వేపచెక్క సమభాగములుగా తీసుకొని పొడిగొట్టి నిలువ ఉంచుకొనవలెను. ఈ  పొడిని ప్రతిరోజు అరగ్రాము మిశ్రమమును నీళ్లతో సేవించుచుండిన ఆమ్ల పిత్తము హరించును.

పేను కొరుకుట
 

గుంట గలగరాకు తీసుకొని దానిని మెత్తగా నూరి తలపైన లేపనము చేయుచుండిన పేను కొరుకుడు హరించి మరల వెంట్రుకలు వచ్చును. 

పండ్లు ఊడి పోవుటకు

పచ్చ డావరడంగి ఫలములను రసము పిండి సీసాలో భద్రపరచు కొనవలెను. కదులుతున్న దంతము చుట్టూ ఈ రసము పూసి ఉంచిన ఆ పన్ను సులభముగా ఊడిపోవును.

- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..