మూర్ఛ వ్యాధి నుండి ఉపశమనం

గృహ వైద్యము - 19


  • ఉసిరికాయల రసములో సమానముగా దేశవాళీ (జెర్సీ ఆవు నెయ్యి విషంతో సమానం) ఆవునెయ్యి కలిపి ఆ మిశ్రమమును ప్రతిరోజు ఒక ఔన్సు (30 మి.గ్రా.) త్రాగుచుండిన ఎడల మూర్ఛవ్యాధి పూర్తిగా తగ్గిపోవును. అవసరమును బట్టి దినమునకు రెండు నుండి మూడుసార్లు త్రాగవలెను.
  • కొడిశ పాలగింజలు, మిరియాలు మరియు పటిక బెల్లము సమభాగములుగా కలిపి చూర్ణము చేసి ఒకటి నుంచి రెండు గ్రాముల చూర్ణమును ప్రతిరోజు సేవించిన అసాధ్యములైన మూర్ఛలు హరించబడును.
 
 
  • వెల్లుల్లిపాయలు మరియు నువ్వులు సమంగా కలిపి నూరి శనగగింజలంత మాత్రలు చేసుకుని పూటకు ఒకటి నుంచి రెండు మాత్రల వరకు సేవించినచో మూర్ఛలు తగ్గును.
  • నీరుల్లిపాయలను మెత్తగా నూరి అరికాళ్లకు మర్దన చేయించుట వలన మరియు నాలుగు చుక్కల రసము ముక్కులో వేయుట వలన మూర్చ నుండి లేచును.
  • మందార చెట్టు పై బెరడును ఎండించి చూర్ణము చేసి ఉదయం మరియు సాయంత్రం రెండేసి గ్రాముల చొప్పున తేనెతో సేవించిన ఎడల పక్షము రోజులలో మూర్ఛ హరించును.
  • మాల్కంగునీ గింజలను మెత్తగా పొడిచేసి 2 గ్రాముల చూర్ణమును ప్రతిదినమూ ఉదయం పరగడుపున సేవించుచున్న మూర్ఛ హరించును.
  • దిరిశన వేరు పట్టు నూరి ఒక తులము (13 గ్రాములు) ముద్దను నీళ్లతో రోజుకొక్కసారి సేవించిన 30 రోజులలో మూర్ఛవ్యాధి నయమైపోవును.
  • వట్టివేళ్ళ కషాయం 5 తులములము (60 మి.గ్రా.) ప్రతిదినమూ ఉదయం పరగడుపున సేవించుచున్న ఎడల మూర్ఛ వ్యాధి హరించును.
  • సీతాఫలపు చెట్టు ఆకులను చేతులతో నలిపి వాసన చూపించిన ఫిట్స్ తగ్గును.
 
- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..