అమ్మ ఒడికి నిఖా అడ్డు కాదు


లవ్ జిహాద్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఒక హిందూ బాలిక మరొక యువకుడిని వివాహం చేసుకొని తురక మతం పుచ్చుకున్న తరువాత మరలా మాతృ ఒడి ఐన హిందూ ధర్మంలోకి తిరిగి రావాలనుకుంటే, ఆమె యొక్క నిఖా ఒక అవరోధంగా ఉన్నది. ఒక హిందూ బాలికను తిరిగి హిందుత్వంలోనికి రాకుండా ముస్లిం మతోన్మాదులు Dissolution of Muslim Marriage Act-1939 ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. 

ఇటువంటి ఒక కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రభట్టు తీర్పు వెలువరిస్తూ 'ముస్లిమేతర స్త్రీ వివాహం కారణంగా ఇస్లాం మతం స్వీకరించినప్పటికి తిరిగి తన మతంలోకి వెళ్లిపోవాలనుకుంటే, అందుకు అభ్యంతరం లేదు' అని పేర్కొన్నారు. జస్టిస్ రవీంద్ర తన తీర్పులో ఇంకా ఇలా అన్నారు - "75 సంవత్సరాల నాటి D.M.M. Act-1939 కారణంగా హిందూ స్త్రీలను తిరిగి వారి ధర్మం స్వీకరించకుండా అడ్డుకోరాదు. నిఖాను రద్దు చేయవచ్చు". ఈ తీర్పు వల్ల కేరళ, బెంగాల్ రాష్ట్రాలలో జరుగుతున్న లవ్ జిహాద్ ను అడ్డుకునే అవకాశం కూడా ఉన్నది.

- ధర్మపాలుడు