వివేకానంద స్వామి బొమ్మతో నాణాలు


ప్రస్తుతం వివేకానందస్వామి 150వ జన్మదిన సంవత్సర వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ సందర్భంగా వివేకానంద స్మారకంగా 'అయిదు' రూపాయల నాణాలు వివేకానందుని చిత్రంతో విడుదల కానున్నాయి. 


అదేవిధంగా వైష్ఠవీదేవి (జమ్మూ) దేవాలయ బోర్డు రజతోత్సవాల సందర్భంగా 'పది' రూపాయల నాణాలు కూడా విడుదల చేయబడుతున్నాయి. ఈ విషయం రిజర్వ్ బ్యాంకు ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియచేసింది.- ధర్మపాలుడు