ఆచరణలో శూన్యం


"'ఎదుటి వాడికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయీ' అని ఒక చలనచిత్ర పాట ఉన్నది. నిజ జీవితంలో నీతిగా ఉంటే అంతే సంగతులు" అని చెప్పే సంఘటన ఒకటి ఈ మధ్య జరిగింది.   

రామకృష్ణ ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. ఉద్యోగంలో చేరిన 40దినాలకే అతడిని పనిచేస్తున్న చోటు నుండి నిర్దాక్షిణ్యంగా బదలీ చేశారు (అనగా ట్రాన్స్ ఫర్ చేశారు). ఏప్రిల్ 15వ తేదీన డ్యూటీలో చేరిన దినమే రామకృష్ణ 16 లారీల దొంగ ఇసుకను పట్టుకున్నారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా నందిగామలో జరిగింది. ఇసుక కాంట్రాక్టర్లకు ఒక ఎమ్.పి., ఇతర మంత్రులు, ప్రభుత్వ అండ దండిగా ఉన్న కారణంగా పెట్టిన క్రిమినల్ కేసులన్నీ గాలికి కొట్టుకుపోయాయి. 

యస్.ఐ.గారికి స్థానభ్రంశం కలిగింది.
- ధర్మపాలుడు