మతమార్పిడుల కోసం నదీ తీరాలలో పాగా వేస్తున్న క్రైస్తవులు

వివాదిత స్నానఘట్టంగా పేర్కొనబడిన స్థలం (ఆంధ్రభూమి ఫోటో)

క్రైస్తవులు ఆంధ్రపదేశ్ లో మరో క్రొత్త అవతారం ఎత్తి వివాదాలు సృష్టిస్తున్నారు. రాజమండ్రిలోని కోటిలింగాల రేవుకు సమీపంలో టింబర్ మర్చంట్ కల్యాణమండపము వద్ద గోదావరి ఒడ్డున బేతస్థ స్నానఘట్టం పేరిట మతం మార్పిడులకు ఒక ప్రత్యేక స్నానఘట్టం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.
 
నదులలో పవిత్ర పుణ్య స్నానాలు చేసే సంస్కృతి భారతీయులది. ఎడారిలో పుట్టిన క్రైస్తవానికి అసలు నదుల గురించి ఏమి తెలుసు? ఎక్కడైనా వాళ్ళ గ్రంథంలో నదుల ప్రస్తావన ఉందా? మతం మార్పిడులు చేసేందుకు భారతీయ విధానాలను స్వీకరించి సామాన్య ప్రజలను మోసగించడం కోసమే ఈ ప్రయత్నం.
 
 
అసలు నదులలో స్నానం చేయించి మతం మార్పిడులు చేయాలనే ఈ ప్రయత్నం హిందువులు నదిలో స్నానాలాచరించే సమయంలో ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. అసలు వీరికి చోటు ఎందుకు ఇవ్వడం? గొడవలు ఎందుకు కొని తెచ్చుకోవడం? కాబట్టి పవిత్ర గోదావరి నదీ తీరంలో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని క్రైస్తవులు విరమించుకోవాలి. ఇటువంటి ఉద్రిక్త పనులను ప్రోత్సహించి హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టవద్దని గోదావరి పరిరక్షణ సమితి క్రైస్తవులను హెచ్చరిస్తున్నది.  జూన్ 2వ తేదీన జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయటానికి నిర్ణయించినట్లు గోదావరి పరిరక్షణ సమితి వారు ఒక పత్రికా ప్రకటన చేసారు. ప్రభుత్వం వెంటనే తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.