ముస్లింలకు ఇక నుండి ప్రత్యేక కోర్టులు కూడా


ముస్లిం ఓటుబ్యాంకు పూర్తిగా జారిపోతుంటే కాంగ్రెస్ కు ఏమీ తోచడం లేదు. దానిని తిరిగి సాధించుకోవడానికి ఇప్పటికే అనేకం చేసింది. ఈ మధ్య మరో అంశాన్ని తెరపైకి తెస్తున్నది. మార్చి 25న వచ్చిన వార్తను చూస్తే ''ఉగ్రవాదులుగా లేక అటువంటి కేసుల్లో ఉన్న ముస్లిం మైనారిటీల కేసులు విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని" ప్రతిపాదించింది. కొన్ని కేసుల విచారణ 10 నుండి 14 సంవత్సరాలు పడుతున్నది. ఇటువంటి వాటికి కొంత సమయాన్ని నిర్దేశించింది. ఈ సమయంలోనె కేసు విచారణ పూర్తి చేయాలనేది ఒక ఆలోచన. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇంకా కొన్ని ఇతర సంస్థల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఈ ఆలోచన చేస్తున్నది.

ఇంకొద్ది రోజులలోనె ముస్లింలకు ప్రత్యేక కోర్టులు అవతరించవచ్చు.

- రాము