తెలుగు వారికి జబ్బులు రావు

 
నమ్మలేని నిజాలు కొన్ని ఉంటాయి. ఇటీవలి కాలంలో మనం తరచుగా వింటున్న జబ్బులు 'అల్జీమర్స్' అనగా జ్ఞాపకశక్తి క్రమంగా సన్నగిల్లుతూ ఒక దశలో పూర్తిగా నశించిపోతుంది. మనిషి తనను తాను గుర్తుపట్టలేని స్థితి వస్తుంది. ఇంకొక జబ్బు 'డిమెన్షియా'. దీని కారణంగా వ్యక్తి వివపరీతమైన 'మతిమరుపు'కు లోనవుతాడు.
 
ప్రస్తుతం ప్రపంచం ఈ రెండు జబ్బులతోను విపరీతంగా బాధపడుతున్నది. మైసూరులో ఉన్న భారతీయ భాషల కేంద్ర అధ్యయన సంస్థ (ఇ.ఐ.ఐ.ఎల్.) కు చెందిన డాక్టర్ ఎ.కె.మొహంతి భాగ్యనగరానికి చెందిన న్యూరాలజిస్టులు అల్లాది సువర్ణ, దుగ్గిరాల వసంత, సూరంపూడి బాపిరాజు, మేకల శైలజ తదితర శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని వెల్లడించారు. వారు చెప్పిన విషయం ఇలా ఉంది :
"తెలుగు వారికి 'అల్జీమర్స్'  లేదా 'డిమెన్షియా' జబ్బులు అంటవు". ఈ వార్త సంతోషకరమైనదే, కాని కారణం కొద్దిగా వింతగా ఉన్నది. "మాతృభాషాభిమానం శూన్యమై తెలుగు సరిగా మాట్లాడలేకపోయినా, ఇతర భాషలు ధారాళంగా మాట్లాడగలిగే తెలుగువారికి 'వివిధ భాషల జ్ఞానం' కారణంగా మెదడు చురుగ్గా ఉండి ఈ జబ్బులు రావు.

కారణం ఏమైతేనేం? మన క్షేమమే కదా!
 
- ధర్మపాలుడు