సేవాభారతి ఆధ్వర్యంలో నిరుపేద అమ్మాయి వివాహం

 
చార్మినార్ భాగ్ వట్టిపల్లి దేవాలయంలో సేవాభారతి, భాగ్యనగర్ వారి ఆధ్వర్యంలో 12 మే, 2013 నాడు మంగ అనే ఒక నిరుపేద అమ్మాయి వివాహం జరిగింది. అమ్మాయిని సునిల్ ముదిరాజ్ అనే అబ్బాయికిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ఈ కార్యక్రమంలో డా.రాచన్న (నగర సంఘచాలక్), డా.భార్గవ్, శ్రీ కాసోజి పాండుచారి, శ్రీ బూర్గు రమణ (విభాగ్ సేవా కార్యదర్శి), విభాగ్ శారీరిక్ ప్రముఖ్ శ్రీ ఎర్ర నర్సింగరావు, భాగ్ కార్యవాహ శ్రీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.  
 
అమ్మాయి రాష్ట్ర సేవికా సమితిలో సేవిక. ఈ వివాహంలో చుట్టుప్రక్కల దుకాణదారులు, ముస్లింలు కూడా పాల్గొని కానుకలు సమర్పించారు.