పాస్ పోర్టులు "అన్నీ" ఉండి తీరాలి


ఒకటి కంటే ఎక్కువ పాస్ పోర్టులు ఉంటే అమెరికా వెళ్లదలచుకున్నవారు అన్ని పాస్ పోర్టులు వెంట తెచ్చుకోవాలని, భాగ్యనగరంలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ ధనానీ ఒక ప్రకటనలో వెల్లడించారు. పాత పాస్ పోర్టులోని కాగితాలు చించి కొత్త వాటికి అతికిస్తే కుదరదని ఖచ్చితంగా చెప్పారు. 

ఇదేమి వింత? ఒక పాస్ పోర్ట్ దొరకటమే గగనంగా ఉన్నప్పుడు ఎక్కువ పాస్ పోర్టులు ఎక్కడి నుండి వస్తాయి? అని ఆశ్చర్యపోకండి. మన భాగ్యనగరంలోని మహమ్మదీయ సోదరులకు అడిగిన వెంటనే ఎన్ని పాస్ పోర్టులైనా ఇస్తారు. గతంలో కొంతమంది ఎక్కువ పాస్ పోర్టులు కలిగి ఉన్నందుకు అరెస్టు కూడా అయ్యారు.

- ఈనాడు 29/5/2013

- ధర్మపాలుడు