వ్యవసాయానికి ఆధారం గోవు

భారత సంతతికి చెందిన ఆవు, దూడ
 
అది 2009 సెప్టెంబరు 30. ఆ రోజున ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో భారతదేశంలో మరో సాంస్కృతిక పునరుజ్జీవనానికి విశ్వమంగళ గోగ్రామ యాత్ర ప్రారంభమైంది.
 
భారతదేశానికి కేంద్రబిందువు గ్రామం. గ్రామానికి కేంద్రం గోవు. ఈ దేశంలో గో సంతతి పరిస్థితి, జీవనాధారమైన వ్యవసాయ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పరిస్థితతులలో మార్పు తీసుకొని వచ్చి మళ్ళీ మన గ్రామాలు స్వయంపోషక కేంద్రాలు కావాలి. కాలుష్యం బారి నుండి బయటపడాలి. ఇటువంటి అనేక లక్ష్యాలతో గోగ్రామయాత్ర జరిగింది. దేశవ్యాప్తంగా గోవంశ సంరక్షణకు జనచైతన్యం కోసం ఆ సంవత్సరమంతా విశేష ప్రయత్నం జరిగింది.
 
గోవును రక్షించినట్లయితే గో ఆధారిత వ్యసాయం, పరిశ్రమలు, (గోమూత్రం, గోమయం) ఏర్పాటు చేసుకోవచ్చు. పుష్కలంగా ఉపాధి దొరుకుతుంది. ఈ విశిష్ట లక్ష్యంతో యాత్ర జరిగి వచ్చే సెప్టెంబరుకు 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ ఐదు సంవత్సరాలలో దేశంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గో సంతతి సంరక్షణకు ప్రయత్నాలు ముమ్మరమైనాయి. గో ఆధారిత వ్యవసాయంపై శ్రద్ధ పెరిగింది. క్రొత్త క్రొత్త ఆలోచనలు వికసించాయి. ఈ ఐదు సంవత్సరాలలో చోటు చేసుకున్న ప్రముఖ అంశాలను వచ్చే నెల నుండి ప్రముఖంగా ఇవ్వటం జరుగుతుంది. గో సంరక్షణకు, గో ఆధారిత వ్యవసాయమునకు అందరం చేయూతనిచ్చి వికాసానికి కృషి చేద్దాం.