మతమార్పిడులు మన స్వాతంత్ర్యానికి ముప్పు

పాఠకుల స్పందన


ఆర్యా!  

స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన ముస్లిం మతమార్పిడుల వలన ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలను స్వాతంత్ర్య సమయంలో మనం కోల్పోయాం. ఇప్పడు అదే మతమార్పిడులు దేశాన్ని మరోసారి చీల్చేంతగా పెరిగిపోయాయి. దేశం మరోసారి చీలితే ఏ రాజకీయ పార్టీ, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఈ దేశ సమైక్యతను కాపాడలేదు. దేశ సమైక్యతకు పునాది హిందూ ధర్మమే. అంటే హిందువులను మతం మార్చే ప్రయత్నాలను నిషేధించాలి. ఇందుకోసం వచ్చే పాశ్చాత్య ధనాన్ని నిషేధించాలి. 

అంతేకాక హిందూ దేవాలయాల నిధులను ఇంటింటా హిందూ ధర్మప్రచారమునకై వినియోగించాలి. ఆలయాల నిధుల విషయంలో రాజకీయ జోక్యం ఉండరాదు. ఒక ధార్మిక మండలి ఈ విషయాలను పర్యవేక్షించాలి. హిందూ ధర్మ పునరుద్ధరణకై 10 లక్షల మంది హిందూ ధర్మ ప్రచారకులు పనిచేయాలి. అప్పుడే హిందూ ధర్మం తిరిగి వైభవోపేతమై, తద్వారా భారతదేశంలోను, ఆ తదుపరి మొత్తం విశ్వమంతటా శాంతి వెల్లివిరుస్తుంది. 

- ఈమని సువర్ణం, తూర్పుగోదావరి జిల్లా