కొత్త ప్రభుత్వంపై పెనుభారం ఉంటుంది

ప్రముఖుల మాట


శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన విషయమై అమెరికా వైఖరికి భారత్ మద్దతు ఇవ్వకపోవడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరిన్ని వత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఎంతైనా ఉంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం న్యూఢిల్లీలో ఏర్పడే కొత్త ప్రభుత్వంపై భారం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఆ కొత్త ప్రభుత్వం రెండు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరముంది. ఒకటి - విదేశాంగ విధానంపై ఏ రాష్ట్ర ప్రభుత్వ సంకుచిత డిమాండ్ల ప్రభావం ఎట్టి పరిస్థితులలోను ఉండకూడదు. రెండు - పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ లతో మన సంబంధాలను మరింత సున్నితంగా అర్థం చేసుకొని, వాటి పట్ల మెరుగైన అవగాహనతో వ్యవహరించాలని అమెరికాకు స్పష్టం చేయడము.

- ఇందర్ మల్హోత్రా, ప్రముఖ జర్నలిస్టు