పక్షవాతము తగ్గుతుంది

గృహ వైద్యము - 14

 
పక్షవాతము :

నేతిలో వేయించిన ఇంగువను పావు గ్రాము నుండి అరగ్రాము వరకు తేనె అనుపానముగా ఇచ్చిన ఎడల పక్షవాతము తగ్గిపోవును. దీనితోపాటుగా 1 భాగము తేనె, 2 భాగములు మంచినీరు కలిపి 3వ వంతు మిగులునట్లుగా కాచి ఆ నీటిని పూటకు 3 తులముల చొప్పున (40 మి.లీ.) దినములో మూడు పూటలా తీసుకొనుచుండిన మూతివంకర రోగము తగ్గును.

తేనెను ఆహారములో కలిపి సేవించినను లేక పూటకు 5 తులముల చొప్పున (60 గ్రా.) ఉదయం, సాయంత్రముల యందు పాలు లేక నీళ్లలో కలిపి సేవించుచుండినను పక్షవాతము, హై బ్లడ్ ప్రెషర్ మరియు నరముల బలహీనత నశించి శరీరమునకు అమితమైన బలము కలుగును.

నల్లజీడి గింజలలోని పప్పు పావుతులము (3 గ్రాములు) మరియు అరతులము (6 గ్రాములు) పటిక బెల్లపు పొడి కలిపి పూటకొక్క మోతాదుగా ప్రతిదినము రెండుపూటలా 15 రోజులూ తినవలయును.

పార్శ్వపు తలనొప్పి : 

రాత్రి పడుకొనేముందు పంచదార లేక చీని పంచదార లేక పటిక బెల్లము అరతులము (6 గ్రాములు) ఒక పావు లీటరు నీటిలో వేసి ఆ పాత్రను మంచము క్రింద ఉంచి పడుకొనవలెను. తెల్లవారుఝామున సూర్యోదయమునకు ముందే ఆ నీళ్లను త్రాగవలెను. ఇట్లు 5 నుండి 6 మారులు చేసిన పార్శ్వపు తలనొప్పి తగ్గిపోవును.

రాత్రి కాచిన పాలలో అన్నము మరియు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి రాత్రంతా ఉంచి ఉదయం నిద్రలేవగానే ముఖము కడిగిన పిదప ఆ అన్నమును ప్రతినిత్యమూ భుజించుచున్న పార్శ్వపు తలనొప్పి తగ్గిపోవును.

ప్రతి నిత్యము సూర్యోదయమునకు ముందే ఆవు నెయ్యి ఒక తులము (12 గ్రాములు), పటిక బెల్లము ఒక తులము (12 గ్రాములు) పొడి కలిపి వరుసగా మూడు రోజులు సేవించిన పార్శ్వపు తలనొప్పి హరించును.

- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..