ఎయిడ్స్ తో పాటు అన్నీ పోతాయి

 
స్వాతంత్ర్యం  విలువైనది, దానిని సరిగా అర్థం చేసుకోకపోతే, అదే విశృంఖలత్వానికి దారితీస్తుంది. సృష్టిలో మానవులకు వివిధ స్వాతంత్ర్యాలను ప్రసాదించినది హిందూ జాతి మాత్రమే. వేయి సంవత్సరాల దాస్యశృంఖలాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి. ఈ రోజున మనలో ఎన్నో వికృతులు చోటుచేసుకున్నాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జూన్ 25నాడు న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ "ఎయిడ్స్ ఒక మహమ్మారి, ఎయిడ్స్ రోగాన్ని నిర్మూలించవలసి ఉంది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం అంత బాగా లేవు" అన్నారు.
 
 
"పత్రికల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా 'కండోమ్ ఉపయోగించండి - ఎయిడ్స్ నుండి రక్షణ పొందండి' అని ఊదరగొడుతున్నారు. అలా చేయడం ద్వారా, మనమే అనైతికతను ప్రోత్సహించిన వాళ్ళమవుతున్నాం. ఇది చాలా తప్పు" అని చెప్పారు డాక్టర్ హర్షవర్ధన్. వారు ఇంకా మాట్లాడుతూ "భార్యా-భర్తల అనుబంధాన్ని గుర్తుచేయాలి, సాంస్కృతిక విలువలు గుర్తు చేయాలి. అంతేకాని! 'జబ్బు రాకుంటే చాలు, ఎన్ని దారుణాలైనా చేయవచ్చు' అని నేర్పడం సరికాదు. ప్రజలను హిందూ జీవన విలువల వైపు మళ్ళిస్తే ఎన్నో సమస్యల నుండి విముక్తి కలుగుతుంది" అని అన్నారు.
 
- ధర్మపాలుడు