ఉమ్మడి పౌరస్మృతి ఉండి తీరాలి

మార్కండేయ కట్జూ
 
మార్కండేయ కట్జూ పేరు విన్నారా? ఈయన మహమ్మదీయుల సూపర్ నాయకుడు. కానీ ఈయనే 'ఉమ్మడి పౌరస్మృతి ఉండి తీరాలి' అంటూ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు. ఢిల్లీ జామా మసీదు షాహి ఇమామ్ కంటే రెండాకులు ఎక్కవే చదివిన మార్కండేయ కట్జూ 31మే, 2014 నాడు ఢిల్లీలో ఒక ప్రకటన చేస్తూ ''యూనిఫాం సివిల్ కోడ్' ఉండి తీరాలి' అన్నారు. ఇంతకాలంగా మహమ్మదీయ నాయకులు వ్యతిరేకిస్తూ వస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) ని కట్జూ కావాలని అనడం మార్పుకు సంకేతం.

ఉమ్మడి పౌరస్మృతి కావాలని ఇంతకాలంగా భాజపా కోరుతూ వస్తున్నది. ఇది ఇలా ఉండగా ఇంద్రేష్ కుమార్ అనే ప్రముఖ ఆర్.ఎస్.ఎస్. నాయకుని నేతృత్వంలో రాష్ట్రీయ ముస్లిం మంచ్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఒక లక్షమంది ముస్లింలు వ్రాతపూర్వకంగా యూనిఫాం సివిల్ కోడ్ కావాలని కోరారు. వారు గోహత్య నిషేధించాలని కూడా కోరారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదే రాష్ట్రీయ ముస్లిం మంచ్ వేదిక ఆధారంగా కాశ్మీరు ముస్లింలు ఇలా ప్రకటించారు - "ఆజాద్ కాశ్మీరు గురించి కొందరు మాట్లాడుతారు, మేము ఇప్పటికీ 'ఆజాద్'గా ఉన్నాం కదా! ఇంకా ఏ ఆజాద్ గురించి మాట్లాడుతున్నారు?" "Who wants Azad; when we have already Azad" అన్నారు. ఈ ప్రకటన వారు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేశారు. ఇప్పుడేమంటారు?!

- ధర్మపాలుడు