రామాయణం యాత్ర

 
తీర్థయాత్రలు చేయడం హిందువుల ప్రత్యేకత. వివిధ యాత్రలు చేస్తూ వారు యావద్దేశం పర్యటించి వస్తూ ఉంటారు. భారత రైల్వే పర్యాటక మరియు భోజనవసతి సంస్థ (IRCTC) వారు ఒక క్రొత్త పర్యాటక ప్రణాళిక ద్వారా అయోధ్య నుంచి శ్రీలంకలో ఉన్న 'నువారా ఇలియ' వరకు ఒక యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర శ్రీ సీతారాములు తిరుగాడిన ప్రదేశాలను స్పృశిస్తూ "రామాయణ యాత్ర" పేరుతో నిర్వహిస్తున్నారు. 
 
2,200 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర అయోధ్యలో ప్రారంభమై శ్రీలంకలో ముగుస్తుంది. సీతమ్మవారు లంకలో ఉన్న ప్రదేశం "నువారా ఇలియా"ను దర్శించే ఏర్పాటు ఉన్నది. ఇందులో భాగంగా సీతమ్మవారి గుడి, రావణుడి గుడి, ఒక గుహలో ఉన్న గాయత్రీపీఠం మరియు భక్త ఆంజనేయ దేవాలయం (ఇవన్నీ లంకలో ఉన్నవి) దర్శించడం జరుగుతుంది. అయోధ్య నుండి చెన్నై వరకు ఎ.సి. రైలులో, అక్కడి నుండి లంకకు విమానంలో ప్రయాణం. 
 
ఇటువంటి యాత్రను రూపొందించిన భారత రైల్వేలు అభినందనీయులు.

- ధర్మపాలుడు