ఇతరుల ఉన్నతికై ప్రయత్నించాలి

దయానంద సరస్వతి
 
 
మనుష్యులలో చాలామంది మొండి పట్టుదల గలవారుగా ఉంటారు. వారు వక్త అభిప్రాయానికి విరుద్ధముగా ఊహించి మాట్లాడుతూ ఉంటారు. ఇట్టివారు మతవాదులలో ఎక్కువగా ఉంటారు. మత దురాగ్రహము ఉన్నవారి బుద్ధి యంధకారమున చిక్కుబడి నష్టమగును. కావుననే నేను పురాణములను, జైనుల గ్రంథాలు, బైబిల్, ఖురాన్ మొదలగు గ్రంథాలను ముందే చెడు దృష్టితో చూడక వాటిలోని గుణములు గ్రహించి దోషములను వదిలివేసితిని. అట్లే ఇతరులు తోటి మానవుల ఉన్నతి కొరకు ప్రయత్నించాలి.