సమాజ ప్రగతి లేనిదే వ్యక్తి ప్రగతి అసాధ్యం

పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ  

పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ 

సమాజ ప్రగతి లేనిదే వ్యక్తి ప్రగతి అసాధ్యం. ఒక వ్యక్తి తాను ఉన్నత స్థితికి వెళితే వెళ్లవచ్చు. కాని తదనుగుణంగా సమాజ ప్రగతి లేనిదే ఆ వ్యక్తి విశిష్టత గుర్తించబడదు. అందువల్లనే అనేకమంది మన ప్రఖ్యాత నాయకులు విదేశాలలో అవమానాల పాలైనారు. ఇల్లు తగులబడుతోంది. ప్రతి ఒక్కడు తనను తాను రక్షించుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు కాని, ఆ మంటలు ఆర్పటానికి ప్రయత్నం చేయటం లేదు. 

మీకు రక్షణ ఉన్నదనుకొంటున్నారా? క్లిష్ట పరిస్థితులలో సమాజం మీకు రక్షణ ఇస్తుందని మీరు నమ్ముతున్నారా? లేదు. కారణం కేవలం సమాజంలో అనైక్యభావం ఉండటమే. మనం బలహీనులుగా ఉన్నాము. అందుచేత ధార్మికమైన ఆరాధన, సంగీతం కూడా దాడులకు కారణమవుతున్నాయి. ఈ సమయంలో కొందరు వ్యక్తులు ఉన్నత స్థితికి వెళ్తే మేలు చేకూరకపోగా అది ఒక ప్రమాదంగా పరిణమిస్తుంది. అందుచేతనే అనేకమంది వ్యక్తులు తమ వ్యక్తిగత వాంఛలను పరిత్యజించి సంపూర్ణ మనస్సుతో ఈ సమాజ సంఘటనకు తమను తాము సమర్పించుకోవాలి.