అగ్ని పరీక్ష గెలిచిన స్వాములు

 
2004వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీనాడు కాంచీపురం వరదరాజస్వామి దేవస్థానం నిర్వాహకుడు శంకరరామన్ హత్య చేయబడ్డాడు. అదే సంవత్సరం నవంబరులో దీపావళి పండుగనాడు పాలమూరులో విడిది చేసి ఉన్న పూజనీయ జయేంద్ర సరస్వతి స్వాములపై శంకరరామన్ హత్యానేరం మోపి వారిని అతి అవమానకరమైన విధంగా తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. అది మొదలుగా శ్రీ స్వాముల వారిని ఎన్నో విధాల అవమానించారు. అప్పటి పోలీసు సూపరింటెండెంటు "ప్రేమ్ కుమార్" (క్రైస్తవుడయి ఉండవచ్చు) అతిగా ప్రవర్తించి శ్రీ స్వామివారిని హంతకుడు అంటూ విపరీతమైన చర్యలకు పాల్పడ్డాడు. తొమ్మిది సంవత్సరాలు సాగిన ఈ హిందూద్వేష నాటకానికి 27 నవంబర్ 2013న తెరపడింది. పాండిచ్చేరిలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి సి.ఎస్. మురుగన్ అంతిమ తీర్పు వెలువరించారు. శ్రీ జయేంద్ర సరస్వతి మరియు శ్రీ విజయేంద్ర సరస్వతి (కాంచిపురం శంకరమఠం - శంకరాచార్యులు) లను నిర్దోషులుగా విడుదల చేయడమే కాక, ఎస్.పి. ప్రేమ్ కుమార్ యొక్క విపరీత చర్యలను ఖండించి అభిశంసించారు. చివరికి ధర్మమే గెలిచింది. యథోధర్మస్తతో జయ:
 
- ధర్మపాలుడు