లండన్ లో బోనాల పండుగ

 
విదేశీయ గడ్డపై ఇంగ్లాండు రాజధాని లండన్ లో మన బోనాల పండుగ జరిగింది. జూలై 21 నాడు లండన్ లో తెలంగాణా ప్రవాస భారతీయుల సంఘం వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి రామచంద్రరావు, తెలంగాణ ప్రముఖ కళాకారుడు బాలకృష్ణ, రాజకీయ విశ్లేషకుడు ప్రకాశం, ప్రవాస భారతీయుల సంఘం నాయకుడు గంప వేణుగోపాలం, అనీలు, కూర్మాచలం, పవిత్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోనాలు ఉత్సవాల సందర్భంగా పిల్లలకు చిత్రలేఖనం మరియు గోరింటాకు పోటీలు నిర్వహించారు. కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహ భరితంగా సాగింది.
 
- ధర్మపాలుడు