ఆర్యా! అంటే బాగుంటుంది..

 
న్యాయమూర్తులను సంబోధించేటపుడు గౌరవ సూచకంగా వాడే 'మైలార్డ్, యువర్ లార్డ్ షిప్, యువర్ ఆనర్' అనే మాటలు తప్పనిసరేమీ కాదు, అని సర్వోన్నత న్యాయస్థానం జడ్జిలు దత్తు, జస్టిస్ బాబ్డేలతో కూడిన ధర్మాసనం స్పష్టీకరించింది. సర్ అని సంబోధించినా సమ్మతమే అని వారు అన్నారు. 
 
ఇది మంచి పరిణామమే. అయితే విదేశీయ పదాలను కాకుండా 'ఆర్యా!' అని సంబోధిస్తే ఇంకా బాగుంటుంది కదా! ఈ కోణంలో కూడా న్యాయస్థానాలు ఆలోచించాలని మా కోరిక.
 
- ధర్మపాలుడు