ఆర్.ఎస్.ఎస్. కుర్రాళ్ళు మా కొంప ముంచారు

అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద ఎకనామిక్ టైమ్స్ బ్యూరో ప్రతినిధి బికాస్ సింగ్ నివేదిక ప్రకారం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మనోగతం ఈ క్రింది విధంగా ఉన్నది.

"ఆర్.ఎస్.ఎస్. కుర్రవాళ్లు మిడతల దండులా వచ్చి పడ్డారు. నిశ్శబ్దంగా పనిచేస్తూ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి ప్రతి ఓటరును కలిసి ప్రభావితం చేశారు. ఈశాన్య ప్రాంతంలో పెద్దగా పట్టులేని భా.జా.పా.కు ఒక గట్టిస్థాయి కల్పించారు. టీ తోటలలో పనిచేసే కార్మికులను 'కమలం' వైపు మళ్ళించారు. వివిధ తెగల నాయకులను ప్రభావితం చేసి మోడీ ప్రభంజనం సృష్టించారు. ఎన్నడూ లేనిది 36.5 శాతం ఓట్లు 'కమలా'నికి వేయించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులను సైతం వదిలిపెట్టలేదు. అస్సాం, అరుణాచల ప్రదేశ్ లలో సుడిగాలిలా తిరిగారు. అస్సాంలోని 14 లోక్ సభ స్థానాలలో భాజపా 7 స్థానాలు గెలుచుకుంది. అరుణాచలప్రదేశ్ లో కూడా ఒక స్థానం గెలుచుకున్నది. హిందీ ప్రాంతానికే పరిమితమైన భాజపా ఈశాన్య భారతంలో పాగా వెయ్యడంలో ఆర్.ఎస్.ఎస్. పాత్ర కీలకం. ఇది మేం ఊహించని పరిణామం. వీళ్లు మా కొంప బాగా ముంచారు".

- ధర్మపాలుడు