బాబ్బాబూ పెట్టుబడులు పెట్టండి


"అయ్యా! దయచేసి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి" అని మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ జపాన్ వారిని అర్థించారు. వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలుండటం సహజమే. కాని ఆ సంబంధాలు గౌరవప్రదంగా ఉండాలి. పెట్టుబడులు ఉభయదేశాల వారు పరస్పరం పెట్టుకుంటారు. కాని ఈ విధంగా దీనంగా అడగటం మనకు తీవ్ర అవమానకరం. ఇందులో అతిశయోక్తి లేదు. ఒక ఆంగ్లపత్రిక ఈ విధంగా వ్రాసింది. 'Invest in India, Please - PM pleads Japan'. ఇందులో "ప్లీజ్" అని ఉంటే ఇబ్బంది లేదు. "ప్లీడ్స్" తోనే వస్తుంది చిక్కు. మరీ అంతగా అభ్యర్థించాలా? 

అంతేగాక "మా దేశం వివిధ రాష్ట్రాల సమూహం. ఈ రాష్ట్రాల సంగతి 2014 ఎన్నికల తరువాత చూస్తాం (అనగా 'భరతం పడతాం' అని అర్థం)." అని అన్నట్లుగా కూడా ఉంది. ఇన్నాళ్లూ భారత దేశం ఒకేదేశం అని మనం అనుకుంటున్నాం. 'కాదు' అని మన ప్రధాని ఒక విదేశీ గడ్డమీద ప్రకటించారు.

మనమేమన్నా 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా' గా ఉన్నామా? ప్రతి భారతీయుడూ నిరసన తెలుపవలసిన విషయం ఇది.

ఈ క్రింది లింక్ చూడండి.

- ధర్మపాలుడు