మదర్సా - తీవ్రవాద శిక్షణా కేంద్రం


"స్వానుభవం అయితే కాని తత్వం బోధపడదు" అని తెలుసుకున్న అమెరికా నాలుక కరుచుకుంటోంది. పాకిస్తాన్ ను ఆదుకోవడానికి చేస్తున్న సహాయంగా నమ్మిస్తూ అమెరికా పాకిస్తాన్ లో డాలర్లు, ఆయుధాలు వర్షంలా కురిపిస్తున్నది. ఆ డాలర్లు, ఆయుధాలతోనే పాక్ అమెరికానే వెన్నుపోటు పొడిచిన వైనం ఒకటి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది.

పాక్ లోని వాయువ్య ప్రాంతం ముఖ్యపట్టణం పెషావర్ దగ్గరలో ఉన్న జామియా తాలిమ్-ఉల్-ఖురాన్-వల్-హదిత్ అనే ఒక మదర్సా పిల్లలకు ఇస్లామిక్ విద్య నేర్పించే ముసుగులో భయంకరమైన తీవ్రవాదులను ఉత్పత్తి చేస్తూ లష్కర్-ఏ-తోయిబా మరియు ఆల్-ఖాయిదాలను సరఫరా చేస్తున్నది. ఈ విషయాన్ని కనిపెట్టిన అమెరికా గూఢచారులు ఆ మదర్సాని "టెర్రర్ ఔట్ ఫిట్"గా అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా పాక్ లో ఉన్న అమెరికా సైనికులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

- ధర్మపాలుడు