అమెరికాలో భారత ఆవులు


ఎక్కడో అమెరికాలో ఉండే ఆవుల్లో భారతీయ మూలాలు ఉన్నాయంటే నమ్మగలరా? కానీ టెక్సాస్ పొడవు కొమ్ముల ఆవులు సహా పలు జాతులకు తాత ముత్తాతలు మన భారతీయ ఆవులేనని ఓ జన్యు పరిశోధనలో తేలింది. భారతీయ ఆవులు తూర్పు ఆఫ్రికాకు వెళ్లి, అక్కడి స్థానిక పశువులతో కలిసిపోయి, ఉత్తరాఫ్రికా తీరం వరకు విస్తరించాయి. అక్కడి నుండి అవి స్పానిష్ పశువులతో కలిసి పోయాయి. అక్కడి నుండి కరిబియన్ దీవులకు, అక్కడి నుండి మెక్సికో, టెక్సాస్ ప్రాంతాలకు విస్తరించి అమెరికాకు చేరాయి. 

ఈ టెక్సాస్ పొడవు కొమ్ముల్లాంటి ఆవులు అనేక కరువు పరిస్థితులను తట్టుకొన్నాయి. ఇది భారతీయ ఆవుల లక్షణం. ఈ కోణంలో పరిశోధన చేయగా పై విషయం తేలింది. 

ఇవి 450 ఏళ్లుగా తమ మనుగడ సాగిస్తూ, సుమారు 200 తరాలుగా తమ జన్యు పరంపరను సాగిస్తున్నాయని ఈ పరిశోధన వెల్లడించింది.

- రాము