పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !

ఏరిన ముత్యాలు
 


పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !


భావం : తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పెద్దగా సంతోషం కలుగదు. ప్రజలు ఆ పుత్రుని చూసి మెచ్చుకొన్ననాడు ఆ తండ్రి నిజమైన సంతోషమును పొందును.