ఆమె పేరే టీస్తా సెతల్వాడ్


గత పదకొండు ఏళ్లుగా ఆమె ఎంతో పేరు గడించారు. సామాజిక కార్యకర్త. హక్కుల ఉద్యమకారిణిగా ఇంగ్లీష్ స్పీకింగ్ మేధావుల చేత ప్రశంసలు పొందారు. అంతేకాదు, మైనార్టీ హక్కుల (కేవలం ముస్లింలు) పరిరక్షణలో ఆమెను మించినవారు లేరు అనే విధంగా ప్రైమ్ టైమ్ డిస్కషన్ కు ఇంగ్లీషు మీడియా ఆమెనే గెస్ట్ గా పిలిచేవారు. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా!

ఆమె పేరే టీస్తా సెతల్వాడ్.

2002లో గోద్రా రైల్వేస్టేషన్ లో అయోధ్య నుండి రైల్లో వస్తున్న రామభక్తుల సజీవ దహనం. ఆ తర్వాత జరిగిన అల్లర్ల తర్వాతే ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ఈ అల్లర్లలో ఇళ్లు, దుకాణాలు, ఆస్తులు కోల్పోయిన వారిని ఆదుకునే సామాజిక కార్యకర్తగా నేషనల్ మీడియా ఆమెకు విస్తృత ప్రచారం కల్పించింది. గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించేది. ఇంగ్లీష్ స్పీకింగ్ లుకింగ్ ఫేస్. టివి డిస్కషన్లకు ఇంకేం కావాలి? అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఆమెను గోద్రా అల్లర్లపై మీడియా చర్చలకు పిలిచేవారు. ఆమె స్క్రీన్ కు అందుబాటులో లేనప్పుడు, ఫోన్ ఇన్ ద్వారా ఆమె అభిప్రాయాలను ప్రత్యక్ష ప్రసారం చేసేస్తారు. ఇలా రాత్రికి రాత్రే ఆమె ముస్లింల హక్కుల రక్షణ కోసం అవతరించిన అభినవ ఉద్యమకారిణిగా కీర్తిస్తూ, మార్క్స్ కళ్లజోడు పెట్టుకున్న మేధావులు పత్రికల్లో పుంఖానుపుంఖాల వ్యాసాలు వ్రాసేవారు. 

అటు ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ మేధావులు, ఇటు మార్క్స్ పిడివాద జర్నలిస్టులు ముస్లింల ఓట్ల కోసం పాకులాడే పార్టీల దృష్టిలో ఆమెను వీర లౌకికవాదిగా చేశారు. ఇంకేముంది? సడన్ గా నేషనల్ వైడ్ ఫుల్ పబ్లిసిటి రావడంతో ఆమె ముస్లింల హక్కులు, గోద్రా బాధితుల పునరావాసం కోసం కేవలం తన కుటుంబ సభ్యులే ట్రస్టీలుగా రెండు ట్రస్టులు ఏర్పాటు చేశారు. నేరుగా విదేశాల నుంచే విరాళాలు పొందేలా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటర్ యాక్ట్ నుండి అనుమతిని కూడా తెచ్చుకున్నారు. ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ నెంబర్ 36910-20108-02885లో జమ చేయడం మొదలుపెట్టారు. తర్వాత 2007 ఏప్రిల్ నుండి 2013 ఏప్రిల్ వరకు ఈ అకౌంట్ నుండి విరాళాల రూపంలో వచ్చిన 1.37 కోట్ల రూపాయల సొమ్మును తన అకౌంట్ తోపాటు తన భర్త అకౌంట్లలోకి మళ్లించింది. ఈ అకౌంట్ నుంచే తన కుమార్తె అకౌంట్ కు 71 వేల రూపాయలను మళ్లించింది. మరోవైపు ఐ.డి.బి.ఐ. బ్యాంక్ (ముంబై)లో సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ పేరును మెయింటెనెన్స్ చేస్తున్న అకౌంట్ నెం. 01404-00020-4736లో 2007 నుండి 2013 వరకు దాదాపు 95 లక్షల రూపాయల పైనే విదేశీ నిధులు జమ అయ్యాయి. ఈ అకౌంట్ కు చెక్ పవర్ కూడా టీస్తా, ఆమె జావేద్ లదే. ఈ ఖాతాలో నుండి కూడా వారు డబ్బులు తమ సొంతానికి వాడుకున్నారు. అంతేకాదు, నబ్రంగ్ ట్రస్ట్ నుండి టీస్తా, జావేద్ లు నెల నెలా చెరొక 40వేల రూపాయల జీతం కూడా తీసుకుంటున్నారు. ఇక తమ కూతురు తమారాకు నెల నెలా 7,500 రూపాయల భత్యం కూడా ఇస్తున్నారు. సమాజ సేవ చేస్తున్నామని విరాళాల ద్వారా వచ్చిన సొమ్ముతో నెల నెలా జీతం పుచ్చుకోవడం టీస్తా లాంటి సామాజిక ఉద్యమకారిణి కుటుంబానికే చెల్లుతుంది. 

గత 11 ఏళ్లుగా వీరు దాదాపు నాలుగు కోట్ల రూపాయలను, అల్లర్ల బాధితులకు పునరావాసం కల్పించకుండా తమ సొంతానికి వాడుకున్నారు. బాధితుల సొమ్ముతో ఫిక్స్డ్డ్ డిపాజిట్లు, కంపెనీ షేర్లలో, మ్యూచువల్ ఫండ్స్ లో తమ పేరున పెట్టుబడులు కూడా పెట్టినట్లు తెలిసిన వారే చెబుతున్నారు. 2002 వరకు అంతంత మాత్రంగానే ఉన్న ఆమె ఆర్థిక పరిస్థితి ఈ ఇంగ్లీష్ మేధావులు, మీడియా పుణ్యమా అని ఇప్పుడు బాగానే మెరుగుపడింది. 2002 నుండి ఆమెతో కలిసి ముస్లింల హక్కుల పరిరక్షణ పేరుతో పోరాటం చేస్తున్న రయాస్ ఖాన్ ఈ విషయాలు బయటపెట్టాడు.  దీనిపై వాస్తవాలు తెలుసుకోవాలని పయొనీర్ పత్రిక ప్రతినిధి ఫోన్ ద్వారా టీస్తాను సంప్రదిస్తే ఆమె కనీసం మాట్లాడేందుకు కూడా నిరాకరించారు. మరోవైపు బాధితుల సొమ్ముతో జీతాలు తీసుకొనే ఈ ఉద్యమకారిణి అక్రమాలను బయట పెట్టేందుకు మన నేషనల్ మరియు తెలుగు మీడియా నిఘా రిపోర్టర్ లకు కలం కదలడం లేదు. గోద్రా అల్లర్ల బాధితులకు ఆమె చేస్తున్న మోసంపై చర్చించేందుకు కనీసం ఓ వార్తను 30 సెకన్ల పాటు ప్రసారం చేసేందుకు సమయం కూడా ఈ మేధావి మీడియాకు లేదు. ఎందుకంటే బ్రిటన్ సింహాసనానికి మూడో వారసుడు జన్మించాడు. ఆ ప్రిన్స్ పుట్టినరోజు నుండి బారసాల వరకు అన్ని సంబరాలను లైవ్ లో టెలికాస్ట్ చేయాలి కదా! 

కనుక ఇప్పటికైనా జాతీయవాదులను అదే పనిగా విమర్శించే సూడో సామాజిక కార్యకర్తల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా టీస్తా సెతల్వాడ్ లాంటి ఇంగ్లీష్ స్పీకింగ్ మోసకారిణిల పట్ల మరీ అప్రమత్తంగా ఉండాలి. 

- నారద