వడదెబ్బకు మందు

 
వడదెబ్బ తగ్గుటకు
 
  • నీరుల్లిపాయల రసమును కణతలకు, హృదయమునకు పూయుచుండిన వడదెబ్బ హరించును.
  • మేకపాలు తీసుకొని వడదెబ్బ తగిలిన వారికి అరచేతులకు, పాదములకు మర్దన చేయవలెను.
  • చల్లటి మంచినీటిలో నిమ్మకాయ రసమును, తగినంత ఉప్పు కలిపి మాటిమాటికి త్రాగించినచో వడదెబ్బ దెబ్బకు ఎగురును.
  • పండిన చింతకాయలను నీళ్లలో పిసికి ఆ రసములో కొంచెము ఉప్పు కలిపి త్రాగించుచుండిన వడదెబ్బ హరించును.
 
వేసవిలో మూత్రము కష్టముగా వచ్చుట
 
  • వరిగడ్డిని తెల్లటి బూడిద అగునట్లు కాల్చి ఆ మసిని రెండు తులములు (25 గ్రాములు) తీసుకొని ఒక శేరు (1 లీటరు) నీళ్లలో కలిపి ఇచ్చుచుండిన మూత్రము ధారాళముగా విసర్జింపబడును.
  • బార్లీ బియ్యమును (బార్లీ గింజలు) గంజిలాగా వండి ఆ గంజిలో కొద్దిగా చక్కెర కలిపి సేవించుచుండిన ఎండాకాలములో మూత్రము కష్టముగా వచ్చుట ఉపశమించును.
 
ముక్కు నుండి రక్తము కారుట

  • ఉసిరికాయ పెచ్చులను నేతితో నూరి ముద్దగా చేసి ఆ ముద్దను తలపై లేపనము చేయవలెను. అట్లు చేసినచో ముక్కు నుండి రక్తము కారుట ఆగిపోవును.
  • లేత మర్రి చిగుళ్లు 20 గ్రాములు తీసుకొని మెత్తగా నూరి పావుశేరు నీళ్లలో కలపాలి. అందులో 30 గ్రాములు పటిక బెల్లమును వేసి కరిగించి ఉంచుకోవాలి. ఈ ఔషధమును రోజుకొకసారి ప్రతిరోజు త్రాగుచుండిన ముక్కు నుండి రక్తము కారుట ఆగిపోవును. ఈ బాధ అనేక సంవత్సరముల నుండి ఉన్ననూ ఈ ఔషధముతో ఉపశమించును.
 
- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన 
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..